Eagle | మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. కానీ సినిమాలో రవితేజ యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ ఈగల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇన్నిరోజులు థియేటర్లో రచ్చ లేపిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈగల్ ఓటీటీ రైట్స్‌ను తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్ దక్కించుకుంది. ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేస్తూ ఈగల్ చిత్ర యూనిట్‌తో పాటు ఈటీవీ విన్ కూడా పోస్టర్లను రిలీజ్ చేశాయి. అయితే ఎప్పట్నుంచి ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తారనేది మాత్రం ప్రకటించలేదు. అయితే ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా నాలుగు వారాల తర్వాత అంటే మార్చి 9వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో ఇంకా ముందుగా కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెప్పించింది. నవదీప్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈగల్ సినిమాను తెరకెక్కించారు.