Ravibabu | టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీనియర్ చలపతిరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రవిబాబు నటుడిగానే కాకుండా దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, అనసూయ, నచ్చవులే, అమరావతి, మనసారా, నువ్విలా, అవును తదితర సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన అవును మూవీకి సంబంధించి తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు రవిబాబు.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అవును సినిమాలో మొదట కథానాయకుడిగా రౌడి హీరో విజయ్ దేవరకొండను అనుకున్నాను. నాకు విజయ్ నువ్విలా సినిమా అప్పుడు పరిచయం. ఆ సినిమాలో ఒక రోల్ కూడా చేశాడు విజయ్. కానీ అవును షూటింగ్ సమయంలో విజయ్ అందుబాటులో లేకపోవడంతో హర్షవర్థన్ రాణేను హీరోగా తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఆ సినిమాలో విజయ్ ఉండేవాడు అంటూ రవిబాబు తెలిపాడు.