బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో హౌజ్ మేట్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరినొకరు మాటలు అనుకోవడం, తర్వాత సారీలు చెప్పుకోవడం కామన్ అయింది. అయితే యాంకర్ రవి తనపై పడ్డ మరకలను చెరుపుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. నామినేషన్ సమయంలో మళ్లీ గుంట నక్క టాపిక్‌ని నటరాజ్ మాస్టర్ మరోసారి తెరపైకి తేవడంతో మంగళవారం రోజు డైరెక్ట్‌గా వెళ్లి ఆయన్నే అడిగేశాడు.
మాస్టర్ గుంటనక్క నేనే కదా.. నిజం చెప్పండి మాస్టర్.. ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అని అంటే.. అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.. నాకు ఎట్లా ఉంటుంది అన్నా.. అని ఎమోషనల్ అయ్యాడు రవి. దీనికి స్పందించిన నటరాజ్ మాస్టర్.. నువ్వు వేరే వారిని ఇన్ఫ్లూయెన్స్ చేయకు అని అన్నాడు. అయితే ఓ ఊసరవెళ్లి నా దగ్గరకు వచ్చి రవికి కరెక్ట్ పేరు పెట్టావు అని చెప్పాడు అని పరోక్షంగా విశ్వను ఉద్దేశించి అన్నాడు.
దీంతో రవి.. విశ్వ దగ్గరకు వెళ్లి .. ‘నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని అడిగాడు రవి. దీంతో విశ్వ షాకయ్యాడు. నేను ఆ మాట అనలేదు డార్లింగ్. ఆ మనిషితో మాట్లాడటమే వేస్ట్ అని అన్నాడు. మరోవైపు నామినేషన్లో లోబో అన్న మాటలకు ప్రియ బాగా హర్ట్ అయింది. తను ఏడుస్తుంటే మిగతా సభ్యులంతా వెళ్లి ఓదార్చారు. లోబో వెళ్లి ప్రియని హగ్ చేసుకొని ఇద్దరి మధ్య ఉన్న గొడవని పోగొట్టేశాడు.