Mr Bachchan |మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ధమాకా తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. ఈ సారి సరైన్ బ్రేక్ అందుకోవాలని కసిగా ఉన్న రవితేజ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
తాజా సమాచారం మిస్టర్ బచ్చన్ కొత్త షెడ్యూల్ లక్నోలో షురూ అయింది. త్వరలోనే రవితేజ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడట. లక్నోలో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతుండగా.. ఈ షూట్‌తో 50 శాతం సినిమా పూర్తి కాబోతుందట. రవితేజ ఇప్పటికే షూటింగ్ నుంచి విరామం తీసుకొని ఫ్యామిలీ వెకేషన్ కోసం యూఎస్ వెళ్లి.. తిరిగొచ్చేశాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు.
ఈ మూవీ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని కగా.. తాజా సినిమాకు మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ‘మిస్టర్ బచ్చన్..నామ్ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో సినిమా గ్రాండ్‌గా లాంఛ్ అయింది. రవితేజ కథానుగుణంగా అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపిస్తారట. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: మిక్కీ జే మేయర్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: హరీశ్ శంకర్.