Mr Bachchan | అగ్రహీరో రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్‌శంకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణం పూర్తికావస్తున్నది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఓ షో రీల్ వీడియోను రిలీజ్ చేశారు. రవితేజ ైస్టెలిష్, మాస్ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ ఈ వీడియో సాగింది.
ఇందులో జగపతిబాబు కూడా ఓల్డ్ గెటప్పులో క్రూరమైన విలన్‌గా కనిపిస్తున్నారు. స్వతహాగా అమితాబ్ అభిమాని అయిన రవితేజా.. ఈ వీడియో చివర్లో బిగ్‌బీని ఇమిటేట్ చేస్తూ అభిమానుల్ని అలరించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సచిన్ ఖేడేకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, సంగీతం: మిక్కీ జె.మేయర్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.