మహిళలందరూ ఇష్టపడతారు
ఇది కేవలం స్పోర్ట్స్ సినిమానే కాదు. ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. నన్ను హీరోగా ఎంతగానో ఆదరించారు.
‘ఇది కేవలం స్పోర్ట్స్ సినిమానే కాదు. ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. నన్ను హీరోగా ఎంతగానో ఆదరించారు. నిర్మాతగా కూడా మద్దతునివ్వండి’ అని అన్నారు హీరో రవితేజ. ఆయన నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్‌వర్క్స్, విష్ణువిశాల్ స్టూడియోస్‌తో కలిసి తెరకెక్కించిన చిత్రం ‘మట్టి కుస్తీ’. విశాల్, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటించారు. డిసెంబర్ 2న విడుదల కానుంది.
ఆదివారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ ‘ స్పోర్ట్స్, ఫ్యామిలీ అంశాలు మేళవించిన ఈ కథ తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అన్నారు. ‘రవితేజగారు మంచి మనసున్న వ్యక్తి. ఆయన మద్దతుతో మీ ముందుకొస్తున్నా. నా సతీమణి జ్వాలా గుత్తా నేను తెలుగు సినిమాలు చేయాలని చెబుతుంటుంది.
స్త్రీపురుషులు సమానమనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశాం. మహిళలందరూ ఈ కథను ఇష్టపడతారు’ అని విష్ణువిశాల్ తెలిపారు. వాణిజ్య అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు చెల్లా అయ్యావు చెప్పారు. విష్ణువిశాల్ను తెలుగు సినిమా చేయమని మూడేళ్లుగా అడుగుతున్నానని, కథాపరంగా విభిన్నమైన చిత్రమిదని జ్వాలా గుత్తా పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

