టాలీవుడ్ (Tollywood) మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టి పక్కా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అంటున్నాడు. ప్రస్తుతం కొత్త డైరెక్టర్ శరత్ మండవ (Sarath mandava) దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు రావణాసుర, ధమాకా చిత్రాలు కూడా సెట్స్ పై ఉన్నాయి. ఈ మూవీస్ సెట్స్ పై ఉండగానే రవితేజ మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇపుడు ఫిలింనగర్లో హల్ చల్ చేస్తోంది.
రవితేజ మరో యువ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడట. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రాన్ని తెరకెక్కించిన మున్నా(Munna)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్ నడుస్తోంది. మున్నా వినిపించిన కథ ఇంప్రెస్ చేయడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు ఓ వార్త ఇపుడు టాలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ప్రముఖ నిర్మాత ఒకరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు వార్తలు వస్తుండగా..ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది.
రామారావు ఆన్ డ్యూటీలో దివ్యాంక కౌశిక్ (divyanka kaushik), రజిష విజయన్ (Rajisha Vijayan) ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా..ధమాకాలో పెళ్లిసందD ఫేం శ్రీలీల హీరోయిన్ నటిస్తోంది.