e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News కొడుకు, తండ్రితో ర‌వితేజ‌.. వైర‌ల్‌గా మారిన ఫొటో

కొడుకు, తండ్రితో ర‌వితేజ‌.. వైర‌ల్‌గా మారిన ఫొటో

కొడుకు, తండ్రితో ర‌వితేజ‌.. వైర‌ల్‌గా మారిన ఫొటో

మాస్ మ‌హ‌రాజాగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ర‌వితేజ‌. ముందుగా అస్టిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన ఆయ‌న త‌ర్వాత స‌పోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాడు. ఆ త‌ర్వాత 1997 లో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సింధూరం మూవీలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా నటించాడు. ఇక నీ కోసం సినిమాతో హీరోగా ప‌రిచయం అయిన ర‌వితేజ .. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ శీను, కిక్, విక్రమార్కుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల‌తో మాస్ మ‌హారాజాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ర‌వితేజ ఫ్యామిలీ ప‌ర్స‌న్ అనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఫ్యామాలీతో ఎంత‌గా ఎంజాయ్ చేసిన వారికి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌పెట్ట‌డు. ఏదైన మేజ‌ర్ అకేష‌న్ ఉంటే త‌ప్ప త‌న ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేయ‌డు ర‌వితేజ. తాజాగా త‌న కొడుకు, తండ్రితో క‌లిసి దిగిన ఫొటోని ర‌వితేజ షేర్ చేయ‌గా, ఇందులో కొడుకు చాలా హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నాడు. రానున్న రోజుల‌లో ర‌వితేజ త‌న‌యుడు హీరోగా ప‌ల‌కరించిన కూడా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని అంటున్నారు. 2000 సంవ‌త్స‌రంలో రవితేజ-కళ్యాణిలకు వివాహం కాగా, వారికి మొదటి సంతానంగా 2003లో అమ్మాయి మోక్షద పుట్టింది. ఇక కొడుకు మహాధాన్ 2010లో జన్మించాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొడుకు, తండ్రితో ర‌వితేజ‌.. వైర‌ల్‌గా మారిన ఫొటో
కొడుకు, తండ్రితో ర‌వితేజ‌.. వైర‌ల్‌గా మారిన ఫొటో
కొడుకు, తండ్రితో ర‌వితేజ‌.. వైర‌ల్‌గా మారిన ఫొటో

ట్రెండింగ్‌

Advertisement