Eagle | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ (Ravi Teja). ఈ లీడింగ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఈగల్ (Eagle). సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి తాజా అప్డేట్ బయటకు వచ్చింది. తాజా వార్తల ప్రకారం ఈగల్ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొనసాగుతోంది.
జులై 4వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుండగా.. తాజా షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టేనని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో అనుపమపరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తోండగా.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రవితేజ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao)తో ఫుల్ బిజీగా ఉన్నాడు. 1970స్ పీరియడ్‌లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో టైగర్ నాగేశ్వర్ రా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది.
టైగర్ నాగేశ్వర్ రావులో గాయత్రి భరద్వాజ్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..