రవితేజ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా అంటే చాలు హిట్ పక్కా. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్లే. బ్లాక్బాస్టర్ ‘క్రాక్’ తర్వాత మళ్లీ మరో వినూత్నమైన మాస్ కథాంశంతో వీరిద్దరూ కలిసి రాబోతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈచిత్రం షూటింగ్ త్వరలో మొదలుకానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా యునిక్, పవర్ఫుల్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని మలినేని గోపీచంద్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ల కోసం ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని, మునుపెన్నడూ చూడనంత శక్తిమంతమైన పాత్రలో రవితేజని ప్రేక్షకులు చూడబోతున్నారని, అలాగే వెర్సటైల్ డైరెక్టర్, యాక్టర్ సెల్వరాఘవన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన పాత్ర విభిన్నంగా మెమరబుల్‌గా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. జి.కె.విష్ణు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్.