అగ్ర హీరో రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరును ఖరారు చేశారు. సోమవారం గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ అనౌన్స్మెంట్ గురించి రవితేజ పాత్ర మాట్లాడుతూ ‘నా జీవితంలో ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ అన్నిటినీ అడిగాను.
మేబీ.. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్నింకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడాళ్లూ అడక్కూడదని, పళ్లైన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ మీ రామసత్యనారాయణ చెప్పేదేంటంటే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి..’ అంటూ తన పాత్రతో పాటు టైటిల్ను కూడా పరిచయం చేశారు రవితేజ. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.