Bhadra Movie | మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది భద్ర. మాస్ చిత్రాల కేరాఫ్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకుడిగా మారింది ఈ చిత్రంతోనే. దర్శకుడిగా ఈయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. ఫ్యాక్షన్ బ్రాక్డ్యాప్కు ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు కామెడీని జత చేసి భద్ర సినిమాను తెరకెక్కించారు బోయపాటి.
ఎస్వీసీ బ్యానర్లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మే 12న విడుదలై సంచలన విజయం సాధిచింది. అప్పటివరకు రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను ఈ చిత్రం ఆమాంతం పెంచేసింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అయితే ఒక రేంజ్ లో హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదలై నేటికీ 19 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీని గుర్తు చేసుకుంటూ చిత్రబృందం ప్రత్యేక పోస్ట్ పెట్టింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించింది. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, సునీల్, ఈశ్వరి రావ్ తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు.
19 yrs for Mass Maharaja @RaviTeja_offl‘s Superhit #Bhadra Produced by Super Producer #DilRaju Introducing Mass Director #BoyapatiSrinu in @SVC_official banner (12/05/2005) Rockstar @ThisIsDSP Musical pic.twitter.com/NIW9R6eK40
— BA Raju’s Team (@baraju_SuperHit) May 12, 2024