యాంకర్ రవి.. బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ సీజన్-5లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన రవి.. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్‌తో బయటకు వచ్చాడు. టాప్ 5లో ఉంటాడని ఆయన అభిమానులు ఎంతగానో ఆశించారు. కాని వారికి నిరాశే ఎదురైంది. అనూహ్యంగా 12వ వారంలోనే ఎలిమినేట్ అయి బయటకు రావడాన్ని రవి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రవి మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడంటూ ఈ మధ్య వార్తలు వస్తున్న కూడా అందులో నిజం ఏ మాత్రం లేదు.
బయటకు వచ్చాక రవి.. పలు అంశాల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. తన ఫ్యామిలీపై దారుణంగా కామెంట్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాను అని కూడా తెలియజేశారు. అలానే తనకు జరిగిన నమ్మకద్రోహం గురించి తెలియజేశాడు. ఓ వ్యక్తి తన దగ్గరకు పరిస్థితి బాలేదని వచ్చాడు. అతడికి మందు అలవాటు లేదు, రోజూ గుడికి వెళ్తాడు, నమ్మకస్తుడు.. అందుకని ఏం ఆలోచించకుండా వెంటనే రూ.45 లక్షలు ఇచ్చాను.
20 రోజుల్లో తిరిగిస్తా అన్నవాడు ఇప్పటికీ ఇవ్వలేదు. ఒకడికి మంచి చేద్దామని లెక్కాపత్రం లేకుండా డబ్బిస్తే, అతడు మోసం చేశాడు. చాలా మొత్తం కావడంతో ఆ డబ్బు తిరిగి రావాలని ప్రతిరోజూ దేవుడికి మొక్కుకున్నాను. నా భార్య ఉపవాసాలు, పూజలు చేసింది అని పేర్కొన్నాడు రవి.