Ravi Kishan | ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు రవికిషన్. బన్నీ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్రతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుగు చిత్రాలతో పాటు హిందీ, భోజ్‌పురి, మరాఠీ, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.రవికిషన్ మాట్లాడుతూ .. ఒకప్పుడు నేను పాలతో స్నానం చేసి, గులాబీ రేకులపై నిద్రపోయేవాడిని.నటనంటే అలా ఉంటుందని ఒక భ్రమలో బతికాను.
హాలీవుడ్ స్టార్స్ ఆల్ పాసినో, రాబర్ట్ డి నీరో వంటి వాళ్లు ఎలా ఉండాలో చూపిస్తూ.. ‘నీ లైఫ్‌స్టైల్ కూడా అలానే ఉండాలి’ అని కొందరు ప్రోత్సహించేవారు. అది నా మనసులో బలంగా నాటుకుపోయింది. “అలా ఉండటం వల్లే నేను ‘ది గాడ్ ఫాదర్’ సినిమాను 500 సార్లు చూశాను. ప్రజలు నా గురించి మాట్లాడుకోవాలంటే ఇలా ప్రత్యేకంగా ఉండాలి అనుకున్నాను. కానీ ఇదే నా జీవితంలో డ్రాబ్యాక్ అయింది. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కి నా లైఫ్‌స్టైల్ గురించి తెలిసిన తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ సినిమాలో అవకాశం ఇవ్వలేదు. ‘నీ డిమాండ్స్ తీర్చే బడ్జెట్ నాకు లేదు’ అన్నారు. అలా నా లైఫ్‌స్టైల్ కారణంగా ఓ గొప్ప అవకాశం చేజారిపోయింది అని చెప్పుకొచ్చారు.
‘రేసుగుర్రం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన రవికిషన్, ఆ తర్వాత కిక్ 2, సుప్రీమ్, రాధ, లై, సాక్ష్యం, సైరా నరసింహరెడ్డి, 90 ఎం.ఎల్ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశాడు. తెలుగు సినిమాల్లోనే కాదు, హిందీ, భోజ్‌పురి, మరాఠీ, కన్నడ చిత్రాలలోనూ తన నటనతో అభిమానుల్ని ఆకట్టుకున్న రవికిషన్… ఇప్పుడు రాజకీయాల్లోనూ చురుకుగా కొనసాగుతున్నాడు.