కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తి కావడంతో ఫైనల్‌గా రాజుల దగ్గరున్న నాణాల సంఖ్యను వెల్లడించమని ఆదేశించాడు బిగ్ బాస్. సన్నీ దగ్గర 30 నాణేలు ఉండగా.. అతని రాజ్యంలోని సభ్యులు మానస్ దగ్గర 240 నాణేలు, షణ్ముక్ దగ్గర 220, జస్వంత్ దగ్గర 209 నాణేలు ఉన్నాయి. అలాగే రవి దగ్గర 50 నాణేలు ఉండగా.. ఆయన రాజ్యంలోని ఆనీ మాస్టర్ దగ్గర 176 నాణేలు, హమీదా దగ్గర 60 నాణేలు, విశ్వ 10, శ్రీరామ్ దగ్గర 50 నాణేలు, ప్రియ దగ్గర జీరో నాణేలు ఉన్నాయని బిగ్ బాస్‌కి లెక్క చెప్పాడు శ్రీరామ్.
ఇక రాకుమారులు సన్నీ దగ్గర ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కించారు. సన్నీ దగ్గర ఆరుగురు.. షణ్ముఖ్, మానస్, జెస్సీ, ప్రియాంక, సిరి, కాజల్‌లు ఉండగా.. రవి దగ్గర ఏడుగురు విశ్వ, లోబో, శ్రీరామ్, హమీదా, ఆనీ, ప్రియ, శ్వేతలు ఉన్నారు. దీంతో ఎక్కువ ప్రజలు కలిగిన రాజుగా యాంకర్ రవి విజేతగా నిలిచాడు. దీంతో మొదటి కెప్టెన్ పోటీదారుడిగా అర్హత సాధించాడు.
దీంతో ఎక్కువ ప్రజలు కలిగి ఉన్నందున యువరాజు రవికి పట్టాభిషేకం కూడా జరిపించారు. అంతేకాకుండా ఓడిపోయిన రాకుమారుడితోపాటు అతడి ప్రజల ధనాన్ని స్వాధీనం చేసుకునే ప్రత్యేక అవకాశాన్ని రవికి కల్పించాడు బిగ్‌బాస్. దీంతో జెస్సీ, షణ్మఖ్, సిరి, కాజల్‌లు కష్టపడి దొంగిలిచిన నాణాలు కూడా రవి వశమయ్యాయి. ఆ నాణేలని తన టీం వారికి పంచొచ్చని బిగ్ బాస్. రవికి తెలియజేశాడు.
దీంతో రవి.. చూశారా నీతి నిజాయితీ గెలిచిందని అన్నాడు. వాళ్ల టీంలో అంతా దొంగతనం చేసి నాణేలు సంపాదించారు.. మన టీంలో ఎవరూ దొంగతనం చేయలేదు అని అన్నాడు.