12వ వారం బిగ్ బాస్ లో ఊహించని ట్విస్ట్ నెలకొంది. సిరి, ప్రియాం, కాజల్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అంతా అనుకోగా రవిని ఎలిమినేట్ చేసి పెద్ద షాక్ ఇచ్చారు. చివరకు మిగిలిన కాజల్, రవిల మధ్య ఎలిమినేషన్ టెన్షన్‌ను పెట్టించాడు. అయితే మధ్యలో సన్నీ ఎవిక్షన్ పాస్‌ను వాడే చాన్స్ కూడా ఇచ్చాడు. అది ఎవరికి ఇస్తావో వారు తిరస్కరించేందుకు అధికారం లేదు.. ఒక్కసారి ఇస్తే మళ్లీ వెనక్కి రాదు అని చెప్పాడు.
కాజల్ కోసం తన ఆ పాస్ వాడేందుకు సిద్ధపడ్డాడు. తనకు పాస్ రావడం కోసం కాజల్ గట్టిగా కృషి చేసిందని అందుకే తనకు ఆ పాస్ ఇస్తానని అన్నాడు. అయితే కాజల్ సేఫ్ కావడంతో పాస్ నిరుపయోగంగా మారింది. రవి ఎలిమినేట్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. కానీ రవి మాత్రం ఇంచు కూడా తొణకలేదు. సన్నీ, షన్ను, సిరి, ప్రియాంక వెక్కి వెక్కి ఏడ్చారు. శ్రీరామచంద్ర అయితే ఇంకా షాక్‌లోనే ఉండిపోయాడు. నువ్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి? అని షాక్ అయ్యాడు.
నేను తప్పుగా క్యాలిక్యులేట్ చేశానేమో అని రవి అన్నాడు. ఇక వెళ్తూ వెళ్తూ అందరికీ సలహాలు ఇచ్చాడు. సిరిని టాప్‌లో చూడాలని అన్నాడు. షన్ను ఎప్పటికీ నా బ్రదర్ అని రవి అన్నాడు. మిగతా అందరు గేమ్ చక్కగా ఆడండని సలహాలు ఇచ్చాడు. రవి ఎలిమినేషన్ అని ప్రకటించినప్పటి నుండి షణ్ముఖ్ ఏడుస్తూనే ఉన్నాడు. అతనిని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. మరో వైపు సన్నీ కూడా రవికి భారంగా వీడ్కోలు పలికారు. ఎన్నో కలలతో బిగ్ బాస్ హౌజ్‌లకి వచ్చిన రవి ఓటమి భారంతో బయటకు వచ్చేశాడు.