Kiran Abbavaram |టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తన తాజా చిత్రం విడుదల సమయంలో తమిళనాడు థియేటర్లలో మన సినిమాలకి ప్రాధాన్యత లేకపోవడాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ నిర్మాత, మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవి స్పందించారు. ఆయన నిర్మించిన తాజా చిత్రం “డ్యూడ్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ, కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే అది ఎక్కడైనా బ్లాక్‌బస్టర్ అవుతుంది.
థియేటర్ ల సంఖ్య ఎక్కువగా లేదని నెగటివ్‌గా మాట్లాడటం సబబు కాదు. డ్యూడ్ కంటే ఎవరైనా సినిమాకు మంచి టాక్ వస్తే, షోలు పెరిగిపోతాయి. మేము కూడా అది అంగీకరిస్తాం అని రవి స్పష్టం చేశారు. కంటెంట్ గురించి చూడాలి కాని నెంబర్ అఫ్ థియేటర్ల గురించి మాట్లాడటం కరక్ట్ కాదు. ఇక థియేటర్స్ విషయానికి వస్తే, తమిళనాడులో థియేటర్ల సంఖ్య ఏపీ, తెలంగాణతో పోల్చితే తక్కువ. అందుకే అందరికీ సరిపడాలంటే కొన్ని సినిమాలకు షోలు తక్కువగా దొరుకుతున్నాయి. ఇది కావాలనే చేసింది కాదు. చివరికి సినిమా హిట్టయితే ఆటోమేటిక్‌గా షోలు పెరుగుతాయి అని రవి క్లారిటీ ఇచ్చారు.
కాగా, కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “K-Ramp” చిత్రం అక్టోబర్ 18న, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన “డ్యూడ్” చిత్రం అక్టోబర్ 17న విడుదల కానున్నాయి. ఒక్క రోజు గ్యాప్‌తో రెండు సినిమాలు రిలీజ్ అవుతుండగా, డ్యూడ్ సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించగా, కే-ర్యాంప్‌కు తక్కువగా ఉండటం వల్లే ఈ వివాదం మొదలైంది. ఇటీవల కిరణ్ మాట్లాడుతూ, “తమిళ చిత్రాలకు మన రాష్ట్రాల్లో థియేటర్లు అందిస్తాం. కానీ మన చిత్రాలకు అటువైపు అలాంటి సహకారం ఉండదు. నా ముఖం మీదే థియేటర్స్ ఇవ్వలేమని వారు చెప్పారు అంటూ కిరణ్ అబ్బరవం అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై నిర్మాత రవి ఇచ్చిన సమాధానం ఇండస్ట్రీలో కొంతమేరకు స్పష్టతను తీసుకొచ్చింది. ఒకవేళ కే-ర్యాంప్ మంచి టాక్ తెచ్చుకుంటే, షోలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.