Ravanasura Review | రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. ఆ రెండు సీన్స్ అయితే గూస్బంప్స్ అట..!
Ravanasura Movie Review | మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది చివర్లో ‘ధమాకా’ అంటూ బాక్సాఫీస్ దగ్గర పటాసులు పేల్చిన రవన్న.. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
Ravanasura Movie Review | మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది చివర్లో ‘ధమాకా’ అంటూ బాక్సాఫీస్ దగ్గర పటాసులు పేల్చిన రవన్న.. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అదే జోష్‌తో ‘రావణాసుర’ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ముందు నుంచే ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ చేశాయి. పైగా రవన్న నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతుండటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోయాయి. మరి ప్రీమియర్ షోలు చూసిన నెటీజన్లు సినిమా ఎలా ఉందో వాళ్ల అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Ravansura movie
Final review
First half decent
Interval block mind blowing
Second half kcpd 🔥
Heroines role not impress
But ravanna acting 🔥Overall blockbuster movie
⭐ ⭐ ⭐/1/2USA premiers rating#Ravanasura#RavanasuraOnApril7#RavanasuraReview#blockbusterRavanasura pic.twitter.com/jnKYIRTh2d
— Raghavendra_official (@vallepuraghav) April 6, 2023
నిజానికి ఈ సినిమా రిలీజ్‌కు ముందు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రిలీజ్‌కు నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్లు జరుపుతూ జనాల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశారు. ఇక సినిమా చూసిన కొందరు నెటీజన్లు రవితేజ క్యారెక్టర్ అద్భుతంగా ఉందని, క్రిమినల్ లాయర్ పాత్రలో జీవించేశాడని చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో రవన్న ఇరగదీశాడని తెలిపారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ గూస్బంప్స్ తెప్పించాయని చెప్పారు. అయితే పేరుకు ఐదుగురు హీరోయిన్లైన ఒక్కరి పాత్రకు కూడా సరైన జస్టిఫికేషన్ లేదని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో హింస కూడా ఎక్కువ మోతాదులోనే ఉందని చెబుతున్నారు.
Second half lo manchi twist lu 🔥
Climax BGM💥💥💥💥
As usual story ending avtundi
Lawyer criminal aite ela untundo mana mass maharaj chupichadu
Over all ga movie hit 🔥🔥🔥#Ravanasura #RaviTeja pic.twitter.com/If8CGZL9Cs
— #MaheshBabu𓃵 (@pandugadu_01) April 6, 2023
దర్శకుడు సుధీర్‌వర్మ ప్లాట్ ఎంచుకున్న విధానం బాగుందని, కాకపోతే స్క్రీన్‌ప్లే లో కాస్త తడబడ్డాడని, అయితే రవితేజ క్యారెక్టర్‌ను మాత్రం అద్భుతంగా రాసుకున్నాడని తెలిపారు. ఇక సుశాంత్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని, తన యాక్టింగ్ కూడా చాలా గొప్పగా ఉందని నెటీజన్లు తెలుపుతున్నారు. సంగీతం విషయానికొస్తే భీమ్స్ స్వరపరిచన పాటలు ఒకటి, రెండు బాగానే ఉన్నా మిగిలినవి సో సోగా ఉన్నాయని, కానీ నేపథ్య సంగీతం మాత్రం ఇరగదీశాడని తెలుపుతున్నారు. సింపుల్ సీన్‌ను కూడా తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఎలివేట్ చేశాడని వెల్లడించారు.
Good Plot….@RaviTeja_offl ONE MAN SHOW 🫰The Way Director Narrates Story Is Really Gud..But Last 30 Mins We Can Easily Predict 🤚 Music Is The Biggest Asset 👌
MY RATING 3/5 💫 Easily One Tym Watchable 👍With Ravi Teja Extraordinary Acting ❤️🔥#Ravanasura— taraknani777 (@taraknani7799) April 6, 2023
అయితే కొందరు మాత్రం నిప్పు, ఖిలాడీ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుందని. ఇలాంటి సినిమాలు మళ్లీ చేయకు రవన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే దీనికంటే ఖిలాడీ చాలా బెటర్ అని అంటున్నారు. ఇది కేవలం నెటీజన్ల అభిప్రాయాలు మాత్రమే. మరి సినిమా ప్రేక్షకులన ఏ రేంజ్లో ఆకట్టుకుందో తెలియలంటే ఫుల్ రివ్యూలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
#Ravanasura Ravi anna please ilanti mali cheyiodhu nippu, khiladi feels. Khiladi better anna. Neek failure ravali ani evaru anukoru nuvu matram disasters thisthavu😭 #Raviteja #RavanasuraReview pic.twitter.com/y1GskN6UoZ
— Kranthi Kumar (@Kranthi87605525) April 7, 2023
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడలు నటించారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

