Raudra Rupaya Namaha | ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ‘తళుకు తళుకుమను తారా.. కులుకులొలుకు సితారా’ను సాయికుమార్ ఆవిష్కరించారు.
సురేష్ గంగుల రచించిన ఈ పాటను జాన్ భూషణ్ స్వరపరిచారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ‘టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. సినిమాలోని రెండు పాటలను చూశాను. చాలా బాగున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయం సాధించాలి’ అన్నారు. విభిన్న కథాంశంతో యాక్షన్ ప్రధానంగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు.