Rashmika | టాలీవుడ్లో కొన్ని జంటలు సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపిస్తున్నాయి. వారి గురించి ఎలాంటి ప్రచారాలు జరిగిన కూడా సైలెంట్‌గానే ఉంటున్నారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక జంట ఒకటి. గత కొద్ది రోజులుగా వీరి ప్రేమ వ్యవహారం గురించి నెట్టింట జోరుగానే చర్చ నడుస్తుంది. ఆ మధ్య ఇద్దరు ఒకే కారులో ప్రయాణించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. త్వరలో వారిద్దరు అఫీషియల్ ప్రకటన చేయడం ఖాయమని కొందరు జోస్యాలు కూడా చెప్పారు. కట్ చేస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న , రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
తాజాగా రష్మిక తన కొత్త సినిమా ‘మైసా’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, దానికి విషెస్ అందించారు విజయ్ దేవరకొండ. దానిపై రష్మిక స్పందించిన తీరు అభిమానులలో అనుమానాలు కలిగిస్తుంది. ఈ పోస్ట్‌తో వారి రిలేషన్‌పై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మైసా పోస్టర్ని షేర్ చేస్తూ, “ఇది అద్భుతంగా ఉండబోతోంది” అంటూ అభినందనలు తెలిపారు. విజయ్ పోస్ట్‌కు రష్మిక వెంటనే స్పందిస్తూ.. ఆయన స్టోరీని రీషేర్ చేస్తూ “విజ్జూ.. ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాఅంటూ రిప్లై ఇచ్చింది. ఈ క్యాప్షన్‌కు ఒక హార్ట్ ఎమోజీని కూడా జతచేసింది. దీంతో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంపై కొత్త చర్చ ప్రారంభమైంది.
రష్మిక–విజయ్ ప్రేమలో ఉన్నారన్న పుకార్లు కొత్తవి కావు. ఒకే కారులో ప్రయాణించడం, ఒకరినొకరు సోషల్ మీడియాలో మద్దతుగా నిలబడటం, గతంలో కలిసి వెకేషన్స్‌కి వెళ్లడం. అవన్నీ కూడా అప్పట్లో చర్చనీయాంశాలుగా నిలిచాయి. తాజాగా “విజ్జూ” అని రష్మిక రిప్లై ఇవ్వడం పలు ప్రచారాలకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది. విజయ్-రష్మికల మధ్య నిజంగా ప్రేమ ఉందా లేక అది ఫ్రెండ్షిప్ మాత్రమేనా అనే విషయంపై అనేక చర్చలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరి పోస్ట్‌లు మాత్రం అభిమానులు ఊహలలో విహరించేలా చేస్తున్నారు.