Rashmika | ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న పలువురు హీరోయిన్లు, కొద్దిపాటి సమయం దొరికితే చాలు వెకేషన్‌కు వెళ్లి మైండ్ రీఫ్రెష్ చేసుకుంటున్నారు. ఇదే కోవలో, గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా స్నేహితులతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. రష్మిక తన సన్నిహిత మిత్రులు వర్షా బొల్లమ్మతో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి శ్రీలంకకు వెళ్లి అక్కడి అందమైన ప్రదేశాలను ఆస్వాదించింది. వెకేషన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఈ ఫోటోలకు క్యాప్షన్‌గా రష్మిక.. ఇటీవల నాకు రెండు రోజుల సెలవు లభించింది. అందుకే నా ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీలంకకు వెళ్లాను. ఇక్కడి అందమైన ప్రదేశాలు మమ్మల్ని చాలా ఆకట్టుకున్నాయి. మా బెస్ట్ ఫ్రెండ్స్‌లో కొంతమంది ఈ వెకేషన్ మిస్ అయ్యారు. అయినా ఈ మూమెంట్స్ చాలా స్పెషల్‌గా అనిపించాయి అని పేర్కొంది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఫోటోలు, ఆమె ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా “ఇదే అసలైన రిలాక్సేషన్”, “మీ స్మైల్ చాలూ” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న, అక్కడి యాడ్స్, సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్గా ఎదిగింది.ప్రత్యేకంగా సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో రష్మిక పాన్ ఇండియా స్టార్‌గా మారింది. ఆ తర్వాత ‘పుష్ప 2’ తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రష్మిక ఛావా, కుబేర, థామా, యానిమల్, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, మైసా, రెయిన్బో వంటి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. యువతకు ఈ పాత్ర బాగా కనెక్ట్ కావడంతో సినిమాకు ఊహించని క్రేజ్ వచ్చింది.