Rashmika | శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక, నాగార్జున ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం కుబేర. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల చిత్రంలోని ‘పీ పీ డుమ్ డుమ్’ పాటని ముంబైలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో ధనుష్, నాగార్జున, రష్మిక సహా పలువురు నటీనటులు పాల్గొన్నారు.
రష్మిక గురించి నాగార్జున, ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్ మాట్లాడుతూ… చిత్రంలో నాగార్జునతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో బెగ్గర్ క్యారెక్టర్ ని ప్లే చేశానని.. ఈ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్, హోమ్ వర్క్ ఏమి చేయలేదు. శేఖర్ బ్రిలియంట్ డైరెక్టర్ అని ఆయనను ఫాలో అయ్యానని తెలిపారు. ఇక ఈ చిత్రంలో ఓ సీన్ కోసం డంప్ యార్డ్లో దాదాపు 7 గంటల పాటు తాను, రష్మిక షూటింగ్లో పాల్గొన్నామని చెప్పారు అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉందని.. తనకేం వాసన రావట్లేదు అని చెప్పిందని నవ్వుతూ చెప్పారు ధనుష్. ఆమెకు ఏమైందో తనకు తెలియదు (నవ్వుతూ) అని.. ఎటువంటి అసౌకర్యంగా ఫీల్ కాకుండా సినిమా కోసం అలా కష్టపడడం గొప్ప విషయమంటూ పొగడ్తలు కురిపించాడు ధనుష్.
ఇక నాగార్జున కూడా రష్మికని ఆకాశానాకి ఎత్తేశారు. రష్మిక ఒక పవర్ హౌజ్ అని అన్న నాగార్జున.. మేమెవ్వరం రెండు మూడు వేల కోట్ల హీరోలం కాదని, రష్మిక మందన్న మాత్రం ఆ క్లబ్బులో చేరిపోయిందని పొగడ్తలు కురిపించారు. యానిమల్, పుష్ప 2, చావాలను ఉద్దేశించి నాగార్జున చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. శేఖర్ కమ్ములతో పని చేయడానికి 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఈ సినిమాతో అది నెరవేరిందని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. విలన్ జిమ్ షర్బ్ గురించి నాగార్జున ప్రత్యేక ప్రశంసలు అందించడం గమనార్హం. తనకంటే తెలుగు బాగా మాట్లాడాడంటూ ప్రత్యేక కితాబు ఇచ్చేశారు. ఇక తన క్యారెక్టర్ గురించి ఇప్పుడే రివీల్ చేయనని అన్నారు.