ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప చిత్రం ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయన సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’ క. రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించింది.
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా పుష్ప చిత్రం నుండి రష్మిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శ్రీ వల్లి పాత్రలో రష్మిక డీ గ్లామర్ లుక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక చీరకట్టులో ఎక్కడికో రెడీ అవుతున్నట్టుగా అలంకారం చేసుకుంటుంది. రష్మిక వింటేజ్ లుక్ అభిమానుల మనసులు దోచుకుంటుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప
చిత్రం సాగుతుందని, ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటిస్తున్నారు. విలన్‌గా పాత్రలో మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్రేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ త్వరలోనే విడుదల కానుంది.