Rashmika | ‘మైసా’ కోసం రష్మిక సాహసం.. నీటిలో భారీ యాక్షన్ సీక్వెన్స్
Rashmika | స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ నేషనల్ క్రష్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రం మైసాతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మేకర్స్ వెల్లడించిన అప్డేట్ ఆ ఆసక్తిని మరింత పెంచింది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మైసా' ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
Rashmika | స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ నేషనల్ క్రష్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రం మైసాతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మేకర్స్ వెల్లడించిన అప్డేట్ ఆ ఆసక్తిని మరింత పెంచింది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ఇప్పటివరకు ఎప్పుడూ చేయని ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. ఆమె కెరీర్లోనే ఇది అత్యంత ఛాలెంజింగ్ రోల్స్‌లో ఒకటిగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ను మేకర్స్ పంచుకున్నారు. చిత్రంలో అత్యంత కీలకమైన అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను రష్మిక విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ సన్నివేశం కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుని షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. నీటిలో చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలైట్‌గా నిలుస్తుందని, ఇప్పటికే చిత్రీకరించిన విజువల్స్ అద్భుతంగా వచ్చాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ‘మైసా’ ఆరో ప్రధాన షూటింగ్ షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మిగిలిన సన్నివేశాలను త్వరలో పూర్తి చేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారని సమాచారం.
భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ హై-ఇంటెన్స్ థ్రిల్లర్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కథలో సంగీతానికి కూడా కీలక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అలాగే నటుడు తారక్ పొన్నప్ప ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర కూడా కథలో అనూహ్యమైన మలుపులు తీసుకొస్తుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

