ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ సినిమా తర్వాత మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ వెళుతున్న రష్మిక టాప్ హీరోస్ తో అవకాశాలతో పాటు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది . ఐదేళ్ల కెరీర్ లో కిరాక్ పార్టీ, చెలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. మిషన్ మజ్ను, గుడ్ బై వంటి భారీ ప్రాజెక్టులు చేస్తున్న రష్మిక పలు బ్రాండ్స్ కి అంబాసడర్ గా వ్యహరిస్తున్నారు. ప్రచార కర్తగా తన సంపాదన అధికం చేసుకున్నారు రష్మిక.
రష్మిక గ్లామర్‌తో పాటు ఫిట్నెస్లోను అదరగొడుతుంది. తాజాగా తన ఇన్‌స్టాలో పెట్టిన ఓవీడియో చూస్తే రష్మిక తన పాత్రలో కోసం ఎంతగా కష్టపడుతుందనేది అర్ధమవుతుంది. తన ట్రైనీ తో కిక్ బ్యాగ్ పై సాలిడ్ పంచ్ లు ఇస్తూ గట్టిగా కష్టపడుతుంది. దీనితో ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. ఇదంతా బన్నీ పుష్ప సినిమా కోసమా లేదంటే బాలీవుడ్ చిత్రాల కోసమా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఫోర్బ్స్ భారతదేశంలో ‘అత్యంత ప్రభావవంతమైన నటుల’ జాబితాలో నటి రష్మిక మందన్నా అగ్రస్థానం సంపాదించింది. సమంత, విజయ్ దేవరకొండ, యష్, అల్లు అర్జున్ వంటి హేమహేమీలను దాటుకుంటూ టాప్‌కి చేరింది.
https://www.instagram.com/reel/CVXAUXNqvDX/?utm_source=ig_web_copy_link