Rashmika Mandanna | సెకండ్‌పార్ట్‌లో పుష్పరాజ్ గంధపుచక్కల స్మగ్లింగ్ చేసి బాగా సంపాదించేసినట్టున్నాడు. ఒంటినిండా బంగారంతో శ్రీవల్లిని చూస్తుంటే ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఓవైపు భన్వర్‌సింగ్ షకావత్‌తో గొడవ, మరోవైపు గంధపుచక్కల పంచాయితీ. ఈ కథ ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు చేరుతుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ యాగంటిలో జరగబోతున్నదని రీసెంట్గా తన ఇన్‌స్టా ద్వారా లీక్ చేసింది శ్రీవల్లీ అలియాస్ రష్మిక మందన్నా. దీనికి తగ్గట్టే ‘పుష్ప 2’ లొకేషన్ ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నది.
ఈ ఫొటోలో రష్మిక సంప్రదాయబద్ధంగా ఎరుపురంగు చీర ధరించి, ఒంటినిండా బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్నది. గొడుగు పట్టి మరీ ఈ అందాలరాశిని షూట్‌కి చిత్రబృందం తీసుకొస్తున్న తీరు చూస్తుంటే, నిజంగా మహారాణినే తలపిస్తున్నది రష్మిక. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇలాంటి ఫొటోల వల్ల సినిమా ఆసక్తి ఇంకా రెట్టింపయ్యే అవకాశం లేకపోలేదు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే.