Kingdom Movie | విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండకి కింగ్డమ్ రూపంలో మంచి హిట్ వచ్చినట్లు తెలుస్తుంది. ఎలాగైన హిట్టు కొట్టాలనే కసితో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో కొత్త సినిమా వచ్చిందని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలావుంటే తాజాగా కింగ్డమ్ సక్సెస్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పోస్ట్ పెట్టింది.
ఇది నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘మనం కొట్టినం’ (Manam kottinam). కింగ్డమ్ సక్సెస్ అయ్యిందంటూ రష్మిక రాసుకోచ్చింది. అయితే ఈ పోస్ట్ కింద విజయ్ కామెంట్ పెడుతూ.. ‘మనం కొట్టినం’ అంటూ రాసుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
:,)))
Manam kottinam ❤️— Vijay Deverakonda (@TheDeverakonda) July 31, 2025