Good Bye Movie On OTT | ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్నా. శ్రీవల్లి పాత్రతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తన బాలీవుడ్ ఎంట్రీ కరెక్ట్ అని భావించి ‘గుడ్‌బై’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం రష్మిక ఆశలకు చెక్ పెట్టింది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 7న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన, సెకండ్ డే నుండి ఫుల్ డ్రాప్స్ పడ్డాయి. రెండు వారాల్లోపే చాలా వరకు థియేటర్లలో నుండి వెళ్లిపోయింది. కథ, కథనం బాగనే ఉన్నా దర్శకుడి టేకింగ్ బాగాలేదని పలువురు విమర్శించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా చిత్రబృందం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఒక మనిషి చనిపోతే వాళ్ళ అంత్యక్రియలను ఒక వేడుకలా జరిపించాలి అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ.30 కోట్లతో తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ దగ్గర రూ.9.66 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి 20కోట్లుకు పైగా నష్టాలను తీసుకొచ్చింది.