తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ బ్యూటీ రీసెంట్గా ప్రముఖ డాక్టర్ గురువారెడ్డిని కలవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. హైదరాబాద్లో సెలబ్రిటీ డాక్టర్ (ఆర్దోపెడిక్ సర్జన్) గురువారెడ్డి (Dr. Guruva Reddy)ని కలిసింది రష్మిక. ఇంతకీ రష్మిక డాక్టర్ను కలవడానికి కారణం ఆమె మోకాలి నొప్పి.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు డాక్టర్. గురువారెడ్డి. మీ మొత్తం బరువు మోకాళ్లపై ఉంచి డ్యాన్స్ చేయడం ఈ నొప్పికి కారణమైంది. ‘శ్రీవల్లి’ మోకాలి నొప్పి(Knee pain)తో నన్ను సంప్రదించింది. పుష్ప సినిమా చూసిన తర్వాత రష్మికకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నా. ఆమె మోకాలి నొప్పి నాకు రష్మికను కలిసే అవకాశం కల్పించింది అంటూ ఫేస్ బుక్ పోస్టులో రాసుకొచ్చారు గురువారెడ్డి.
నువ్వు ‘సామి..సామి..’ అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి! అంటూ రష్మికతో కలిసి దిగిన ఫొటోను డా.గురువారెడ్డి షేర్ చేస్తూ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
రష్మిక చేతిలో ఆయా భాషల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులున్నాయి. పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టే ముందే మోకాలి నొప్పి నయం చేసుకునేందుకు చికిత్స తీసుకుంటుంది రష్మిక.