Tripti Dimri | యానిమల్ సినిమాతో సూపర్ హిట్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నారు కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna), తృప్తి డిమ్రి (Tripti Dimri). రణ్‌బీర్‌కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్తో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ ఇద్దరు మరోసారి కలిసిసందడి చేయబోతున్నారా.. ? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ సర్కిల్ కథనాలు. ఇంతకీ ఈ ఇద్దరు మళ్లీ ఏ సినిమాలో నటించబోతున్నారనే కదా మీ డౌటు. అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్న పుష్ప ది రూల్ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారని తెలిసిందే.
ఫస్ట్ పార్టు ఐటెం సాంగ్ ఊ అంటావాలో సమంత కనిపించి సెన్సేషన్ సృష్టించింది. ఇక సీక్వెల్ పార్టులో రాబోయే ఈ పాటలో ఎవరు కనిపించబోతున్నారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్‌లో తృప్తి డిమ్రిని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్టు వార్తలు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ న్యూస్‌ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు తృప్తి డిమ్రి ఫాలోవర్లు. పుష్ప ది రూల్‌లో రష్మిక మందన్నా శ్రీవల్లిగా కనిపించనుందని తెలిసిందే.
ఒకవేళ తాజా కథనాలు నిజమే అయితే తృప్తి డిమ్రి, రష్మిక మందన్నా కాంబోలో మరో సినిమా రావడం ఫైనల్ అయినట్టే. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం సుకుమార్ అండ్ టీం పుష్ప ది రూల్ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న సీక్వెల్ పార్టులో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్న్నాడు.
కపుల్ సాంగ్ అనౌన్స్మెంట్..
The Couple Song Announcement Video 👌https://t.co/aF3T2s5pa5#Pushpa2TheRule#Pushpa2SecondSingle
— Mythri Movie Makers (@MythriOfficial) May 23, 2024
అనసూయ భరద్వాజ్ దాక్షాయణి లుక్..
Wishing the talented @anusuyakhasba a very Happy Birthday ❤🔥
She will be back with #Pushpa2TheRule as the wily ‘Dakshayani’ 💥
Grand release worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @PushpaMovie… pic.twitter.com/BqEIw1cfzA
— Mythri Movie Makers (@MythriOfficial) May 15, 2024
పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో..
పుష్పరాజ్ ఎక్కడ..?
పుష్ప ది రూల్ టీజర్..