Rashmika Mandanna | ఛలో, గీతగోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ సోయగం రష్మిక మందన్నా(Rashmika Mandanna). ఈ నేషనల్ క్రష్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు కామెంట్స్, లైక్స్ వర్షంలా కురుస్తుంటాయి. ఈ భామ తాజాగా Travel+Leisure ట్రావెల్ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నది. మీగన్ కాన్సెస్సియో డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌లో హొయలు పోయింది.
ఆస్ట్రేలియా ప్రకృతి సోయగాల నడుమ పసుపు బ్రాలెట్స్లో పర్ఫెక్ట్ సమ్మర్ ఔట్ఫిట్లో దివి నుండి తారక దిగి వచ్చిందా..? అన్నట్టుగా కనిపిస్తూ నెట్టింట సెగలు రేపుతోంది. ట్రావెల్ మ్యాగజైన్ ఫొటోషూట్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్‌తో కలిసి నటించిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
రష్మిక ఇప్పటికే ఇదే మ్యాగజైన్ కోసం అనైటా ష్రాఫ్ డిజైనింగ్ బ్లాక్ బికినీ వేర్లో బీచ్‌లో హాట్ హాట్ ఫోజులిచ్చిందని తెలిసిందే. రష్మిక తన టీంతో కలిసి అబుదాబిలోని సెయింట్ రెజిస్ సాడియత్ ఐలాండ్ బీచ్‌కు వెళ్లగా.. ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప..ది రూల్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో నటిస్తోంది.
ఇటీవలే మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రాబోతున్న సికిందర్లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఓ అప్డేట్ కూడా వచ్చింది.