Rashmika Mandanna | హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ఆమె వివాహం గురించి వస్తున్న ఊహాగానాలు ఎప్పటి నుంచో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక న్యూ ఇయర్ సందర్భంగా చేసిన రోమ్ ట్రిప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రోమ్ ట్రిప్‌కు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. చారిత్రక కట్టడాల మధ్య పోజులివ్వడం, శీతాకాలపు ఎండలో రిలాక్స్ అవడం, రోమ్ వీధుల్లో స్నేహితులతో సరదాగా గడపడం వంటి దృశ్యాలు ఈ పోస్ట్‌లలో కనిపించాయి. గర్ల్ గ్యాంగ్‌తో డ్యాన్స్ చేస్తూ, స్నేహితురాలితో నడుస్తూ ఉన్న వీడియోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ రష్మిక “Rome so far” అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే రష్మిక షేర్ చేసిన ఫోటోలలో ఒకదాంట్లో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫోటోలో రష్మిక, ఆనంద్ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ కనిపించారు. దీంతో విజయ్ దేవరకొండ కూడా అదే వెకేషన్లో ఉన్నారా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.ఆనంద్ దేవరకొండ కనిపించడంతో, రష్మిక–విజయ్ రిలేషన్‌పై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఈ ఫోటోలపై అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.“విజయ్ ఎక్కడ?” అంటూ ఒకరు ప్రశ్నించగా, కెమెరామెన్ విజయ్ దేవరకొండే అని మరో యూజర్ కామెంట్ చేశాడు.రష్మిక కళ్లజోడులో విజయ్ కనిపిస్తున్నాడా? అంటూ ఇంకొకరు చమత్కరించారు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తొలిసారి ‘గీత గోవిందం’ సినిమా సెట్స్‌లో పరిచయమయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు, వారి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అనంతరం ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా కలిసి నటించారు. తెరపై మాత్రమే కాకుండా, తెర వెనుక కూడా వారిద్దరి సన్నిహితత్వం రిలేషన్ పుకార్లకు దారి తీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే తరహా బ్యాక్‌డ్రాప్స్, కుటుంబ కార్యక్రమాల్లో రష్మిక కనిపించడం వంటి అంశాలు ఈ చర్చలను మరింత బలపరిచాయి.