‘నాన్నతో కలిసి మీ కుటుంబాల్ని కలవడానికి అక్టోబర్ 7న మీ ముందుకొస్తున్నా’ అంటూ రష్మిక మందన్న ‘గుడ్‌బై’ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. హిందీలో ఈ భామ నటిస్తున్న రెండో చిత్రమిది.
ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్ కుమార్తెగా కనిపించనుంది రష్మిక మందన్న. వికాస్ భల్ దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్ నిర్మాత. నీనాగుప్తా, శివిన్ నారంగ్ ముఖ్యపాత్రల్ని పోషించారు.
తండ్రీకూతురు అనుబంధానికి దృశ్యరూపంగా ఫ్యామిలీ డ్రామా, కామెడీ అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న పతంగులు ఎగరేస్తూ ఆనందంగా కనిపిస్తున్నారు.