Rashmika mandanna | తెలుగు సినిమాలు రిజెక్ట్ చేస్తున్న రష్మిక మందన్న..

Rashmika mandanna | తెలుగు ఇండస్ట్రీలో రష్మిక మందనకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయిపోయింది. దానికి తోడు విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ అదిరిపోయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు రష్మిక. వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. అంతలోనే ఈమెకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి.
బాలీవుడ్లో వరుసగా రెండు సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. పైగా స్టార్ హీరోలతో అవకాశాలు రావడంతో గత కొంతకాలంగా ముంబైలోనే ఉంది రష్మిక. అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మళ్లీ ముంబై వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. ఇప్పుడు రష్మిక గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈమె తెలుగు సినిమాలకు నో చెబుతుందనే ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాకు డేట్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వస్తుండటంతో తనకు లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీని వదిలేసింది అంటూ ఈమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. తెలుగులో అవకాశాలు వచ్చినప్పుడు తన మాతృభాష కన్నడ ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఇప్పుడు హిందీలో అవకాశాలు వస్తుంటే తెలుగు ఇండస్ట్రీని వదిలేయడానికి చూస్తుంది అంటూ ట్రోలింగ్ జరుగుతుంది. కానీ రష్మిక మాత్రం అలాంటిదేం లేదు.. తనకు తెలుగులో నటించడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది అని చెబుతోంది. మరి ఇందులో ఏది నిజం అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rashmika Vijay | సేమ్ లొకేషన్లో రష్మిక, విజయ్..సీక్రెట్ ట్రిప్ వేశారా..?
Rashmika Mandanna | అందంతో కుర్రకారు మతులు పోగొడుతున్న రష్మిక..
లైగర్ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే పూరీతో విజయ్ దేవరకొండ వన్స్ మోర్..
Tollywood | ఇండస్ట్రీ పెద్ద టాపిక్‌పై సుమన్ కీలక వ్యాఖ్యలు..
విజయ్ దేవరకొండతో రిలేషన్‌పై ఓపెన్ అయిన రష్మిక
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

