Mysaa | కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మైసా (Mysaa). ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట రౌండప్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. రష్మిక మందన్నా టీం అధికారికంగా షూటింగ్ మొదలుపెట్టేసినట్టు తాజాగా వార్త తెరపైకి వచ్చింది.
కేరళలోని అథిరప్పిల్లీలో అధికారికంగా నేడు షూటింగ్ మొదలైనట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో రష్మిక మందన్నా గోండ్ గిరిజన మహిళగా కనిపించనుందట. ఇప్పటికే విడుదల చేసిన రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇదివరకెన్నడూ కనిపించని నయా అవతార్‌లో మెస్మరైజ్ చేయబోతున్నట్టు ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తుంది.
Rawindra Pulle మైసా సినిమాతో డైరెక్టర్‌గా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ డెబ్యూ డైరెక్టర్ ఇటీవలే మైసా నుంచి రష్మిక మందన్నా అగ్రెసివ్ లుక్ లాంచ్ చేసి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. పుష్ప ప్రాంచైజీలో శ్రీవల్లిగా డీగ్లామరస్ రోల్లో ఇరగదీసిన రష్మిక మందన్నా మరి గోండు గిరిజన మహిళగా మైసా సినిమాలో ఎలా మెప్పించబోతున్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ మూవీలో పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. రష్మిక మందన్నా సినిమాలో తారక్ పొన్నప్ప నటించడం ఇది రెండోసారి. ఈ మూవీకి ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రాజెక్ట్‌కు పనిచేసిన ఆండీ లాంగ్ గ్యుయెన్ స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నాడని సమాచారం.
NC 24 | చేవెళ్ల ప్రమాదం.. చైతూ మూవీ అనౌన్స్మెంట్ వాయిదా వేస్తూ ప్రకటన
Dragon | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ “డ్రాగన్” సినిమా రెండు భాగాలుగా.. భారీ స్కేల్లో షూటింగ్..!
Kantara Chapter 1 | కొనసాగుతున్న కాంతార చాప్టర్ 1 హవా.. కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు!