Rashmika Mandanna | బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న భామల జాబితాలో టాప్‌లో ఉంటుంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ కన్నడ సోయగం ఇటీవలే యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రణబీర్‌కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సాధారణంగా హీరోయిన్లు తమ సినిమా సక్సెస్ అయిందంటే కొంత రిలాక్స్ అవ్వాలని చూస్తుంటారు. కానీ రష్మిక మాత్రం అలా కాదు. ఓ వైపు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే మరో సినిమా షూటింగ్లో జాయిన్ అయిపోయిందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం రష్మిక టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend). ఈ చిత్రానికి యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయింది రష్మిక. 20 రోజులపాటు సాగనున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్లో రష్మిక మందన్నాతోపాటు పలువురు పాపులర్ యాక్టర్లు జాయిన్ అయ్యారని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కూడా కీ రోల్లో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి పాపులర్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. రష్మిక మందన్నా ఖాతాలో పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప.. ది రూల్ కూడా ఉండగా.. చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు రెయిన్ బోలో కూడా నటిస్తోంది. మొత్తానికి నో రెస్ట్.. ఓన్లీ షూటింగ్ అంటూ కోస్టార్లంతా షాకయ్యేలా చేస్తోంది రష్మిక మందన్నా.
After The epic success #Animal
Welcome back National crush @iamRashmika garu to Hyderabad#TheGirlFriend takes off from tomorrow 😍 pic.twitter.com/W84MyzQxOL— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 4, 2023
An auspicious start to something very exciting ❤️🔥#TheGirlfriend begins with a pooja ceremony amidst the team and its well-wishers ❤️
Shoot begins soon! 🎥#RAGARA @iamRashmika @23_rahulr #AlluAravind @SKNOnline #VidyaKoppineedi @DheeMogilineni @HeshamAWMusic @GeethaArts… pic.twitter.com/VymM4vWStf
— Geetha Arts (@GeethaArts) November 28, 2023
రౌడీ వేర్లో స్టైలిష్ వాక్..
Rash in New Rowdy wear😍♥️
Dec lo launch ayye stock I think#VijayDeverakonda #RashmikaMandannapic.twitter.com/ERqPeGLPEt
— 𝐂𝐎𝐌𝐑𝐀𝐃𝐄 (@Tarun_VDF) November 30, 2023
Our cutu know 6 languages 😊@iamRashmika 👌🔥❤️#RashmikaMandanna ❤️ pic.twitter.com/XqWpVgeNPq
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) October 19, 2023