Rashmika Mandanna |ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఆ తర్వాత గీతగోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైంది. ఇప్పటికే తన క్యూట్ క్యూట్ యాక్టింగ్‌తో నేషనల్ క్రష్‌గా మారిపోయిన రష్మిక మందన్నా అత్యంత అరుదైన ఛాన్స్ కొట్టేసింది. సెప్టిమియస్ అవార్డ్స్ -2023 (Septimius Awards 2023)లో ఉత్తమ ఆసియన్ నటిగా నామినేట్ అయింది.
ఇప్పటివరకు దక్షిణాది నుంచి ఏ హీరోయిన్‌కు దక్కని అరుదైన అవకాశం రష్మిక మందన్నా సొంతమైనట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. అవార్డ్సులో నామినేట్ అయిన సంతోషాన్ని రష్మిక మందన్నా షేర్ చేసుకుంటూ.. ఇది లవ్లీ సర్ప్రైజ్.. ఇది కేవలం మీ అందరూ నాపై చూపిస్తున్న అభిమానం, ప్రేమవల్లే ధన్యవాదాలు.. అని ట్వీట్ చేసింది. ఈ అవార్డ్స్ ఈవెంట్ నెదర్లాండ్స్‌లో జరుగనుంది. ఈ రేసులో భారత్ నుంచి రష్మికమందన్నాతోపాటు నమితా లాల్ కూడా ఉంది. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న రష్మిక ఈ సారి కూడా బెస్ట్ ఏసియన్ నటిగా నిలువడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు.
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్పలో శ్రీవల్లిగా సూపర్ పాపులారిటీ సంపాదించింది రష్మిక మందన్నా. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్‌తో బిజీగా ఉంది. హిందీలో అమితాబ్‌తో కలిసి గుడ్‌బైలో మెరిసిన రష్మిక ఖాతాలో రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి నటిస్తున్న యానిమల్తోపాటు రెయిన్బో సినిమాలున్నాయి. పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
యానిమల్ చిత్రాన్ని టీ సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న రెయిన్ బో మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది.
.@iamRashmika Has Nominated For The Best Asian Actress In Septimius Award .#RashmikaMandanna
https://t.co/30L2smke8o pic.twitter.com/w5uTTh2Myn— ᴀɴɪᴍᴀʟ (@stylish_jafar) September 5, 2023
What a lovely surprise this is. 😄🤍 thankyou.. this is all because of you my loves. 🤍 eternally grateful 🤍 https://t.co/RjJRn8acVW
— Rashmika Mandanna (@iamRashmika) September 5, 2023