Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి ఇటీవల ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రష్మిక జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుండగా.. కాలికి గాయం అయినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై డాక్టర్ను కలువగా.. గాయం చిన్నదే అని.. పెద్దగా ప్రమాదం లేదని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఒక వారం పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో రష్మిక ప్రస్తుతం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలావుంటే తన కాలి గాయంకి సంబంధించి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ భామ.
సరే… నాకు నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. నా పవిత్ర జిమ్ మందిరంలో నేను గాయపడ్డాను. ప్రస్తుతం నేను హోప్ మోడ్ లో ఉన్నాను. కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పడుతుందో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. నేను మళ్ళీ తామా, సికిందర్, కుబేర సెట్స్ కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. నేను ఆలస్యం చేస్తున్నందుకు నా దర్శకులకు సారీ. నేను త్వరగా తిరిగి వచ్చి యాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ లోపు నేను మీకు అవసరమైతే ఒక మూలాన కూర్చొని బన్నీ హాప్ వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ రష్మిక చెప్పుకోచ్చింది.
Rashmika Mandanna
Rashmika Mandanna
Rashmika Mandanna
Rashmika Mandanna