Pushpa-2 Movie | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికి టాక్‌తో సంబంధంలేకుండా రూ.360 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. సుకుమార్ బ్రిలియంట్ టేకింగ్‌కు, బన్నీ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ముఖ్యంగా బాలీవుడ్లో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజూ వంద కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.
కాగా రష్మిక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిందని, తను వచ్చే నెలలో షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తాను పుష్ప-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రష్మిక మిస్టర్ మజ్నూ ప్రమోషన్లతో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 20న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఇక రష్మిక బాలీవుడ్లో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు టాక్.
పుష్ప విషయానికొస్తే ఫస్ట్ పార్ట్ ఊహించదానికంటే ఎక్కువ విజయం సాధించడంతో చిత్రబృందం సెకండ్ పార్ట్ కోసం బాగా కష్టపడుతున్నారు. ఈ సారి తెలుగుతో పాటు హిందీ బెల్ట్‌పై కూడా చిత్ర యూనిట్ కన్నేసింది. ఇందులో భాగంగానే పోస్ట్ ప్రొడక్షన్లు పూర్తి కాగానే హిందీలో వరుస ప్రమోషన్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మి్స్తుంది.