Rashmika Mandanna | దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా జోరు చూపిస్తుంది రష్మిక మందన్నా. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీతా గోవిందం’తో తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. ఈ సినిమాతో ఏకంగా మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో యానిమల్ ఒకటి.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ఓ రేంజ్లో జనాలను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రష్మిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మెడలో నల్లపూసల తాడుతో సిగ్గు పడుతున్నట్లున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రష్మిక గీతాంజలిగా కనిపించనుంది. ఇక ఇప్పటికే రిలీజైన రణ్‌బీర్, అనీల్ కపూర్ పోస్టర్లకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాపై సినీ లవర్స్‌లో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్‌కే అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి.. అసలు బార్డర్లు లేని బాలీవుడ్లో యానిమల్తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అందరిలోనూ తిరుగులేని అంచనాలున్నాయి. రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఇన్సైడ్ టాక్. కాగా ముందుగా ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా.. వీఎఫ్ఎక్స్ కారణంగా డిసెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఎలాగో రిలీజ్‌కింకా టైమ్ ఉంది కనుక ఎడిటింగ్ రూమ్‌లో ఎక్కువ కసరత్తులే చేస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు రేయిన్బో అనే ద్విభాషా సినిమా చేస్తుంది. శాంత రూబన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇవే కాకుండా మోస్ట్ అవేయిటెడ్ మూవీ పుష్ప సీక్వెల్లో నటిస్తుంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
Rashmika as Geetanjali :-#AnimalTeaserOn28thSept#AnimalTheFilm #RanbirKapoor @RashmikaMandanna @bobbydeol @TriptiDimri #BhushanKumar
@SandeepReddyVanga @PranayReddyVanga #KrishanKumar @anilandbhanu @tseriesfilms @VangaPictures pic.twitter.com/UtLQvLac5C— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 23, 2023