Rajadelux | ప్రభాస్ ‘రాజాడిలక్స్’లో నటించే ముగ్గురు హీరోయిన్లు.. ఎవరంటే?
Rajadelux |బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ పేరున్న దర్శకులతో కాకుండా కథ నచ్చితే చిన్న దర్శకులతోనూ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
Rajadelux | బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ పేరున్న దర్శకులతో కాకుండా కథ నచ్చితే చిన్న దర్శకులతోనూ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సుజీత్తో సాహో చిత్రాన్ని చేసాడు. ఇప్పుడు రాధాకృష్ణ కుమార్తో రాధేశ్యామ్లో నటించాడు. ఈ చిత్రం మార్చి11న విడుదలకానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రం కూడా దర్శకుడికి రెండవ సినిమానే. వీళ్లతో పాటుగా ప్రశాంత్ నీల్,నాగ్ అశ్విన్, సందీప్రెడ్డిలు కూడా రెండుమూడు సినిమాలతోనే ప్రభాస్తో చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చెయబోతున్నాడు అనే వార్త గతవారం పదిరోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీనిపై మారుతీ కూడా స్పందించకపోవడంతో ఈ రూమర్స్ నిజమేనని స్పష్టమవుతున్నాయి. మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘రాజా డిలక్స్’ టైటిల్ను కూడా పరిశీలనలో ఉంచినట్లు సమాచారం . హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఇందులో ప్రభాస్కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని టాక్. చబ్బీ గర్ల్ రాశిఖన్నా, మలయాళ కుట్టి మాళవికా మోహన్తో పాటు పెళ్లిసందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఎంపికయినట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్నెళ్లలో పూర్తీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనీట్ భావిస్తుందట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

