రెండుగంటల పాటు వినోదాన్ని పంచేందుకు కొన్ని నెలల పాటు చమటోరుస్తారు సినిమావాళ్లు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాణాలమీదకు కూడా తెచ్చుకుంటారు. అందుకే వారి కష్టాన్ని తక్కువచేసి చూడలేం. రీసెంట్గా ఢిల్లీ భామ రాశీఖన్నా ఓ షూటింగ్లో గాయలపాలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన సోషల్ మీడియాలో ఫొటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె చేతికీ, ముఖానికి చిన్న చిన్న దెబ్బలు కనిపిస్తున్నాయి.
‘కథ డిమాండ్ చేస్తే.. గాయాలను కూడా లెక్క చేయకూడదు.. మనమే ఒక తుఫాన్ అయినప్పుడు, మనల్ని ఏ పిడుగూ ఆపలేదు..’ అంటూ ఫొటోలతో పాటు ఓ క్యాప్షన్‌ని కూడా జతచేసింది రాశీఖన్నా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవతున్నది. ఈ ముద్దుగుమ్మ షాహిద్కపూర్తో కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సిరీస్‌కి సంబంధించిన సీజన్2 షూటింగ్ మొదలైనట్టు సమాచారం. ఆ షూటింగ్‌లోనే రాశీఖన్నాకు గాయాలయ్యాయని తెలుస్తున్నది.