3 roses | పాయల్ త్రీ రోజెస్ ట్రైలర్ చూసిన రాశీ ఖన్నా రియాక్షన్ ఏంటో తెలుసా?

3 roses | ‘మహిళా సాధికారతను చాటిచెబుతూ సమాజపరంగా వారు ఎదుర్కొనే వివక్ష, అసమానతల్ని సందేశాత్మకంగా ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన సిరీస్ ఇది’ అని చెప్పింది రాశీఖన్నా. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘ త్రీ రోజెస్ ‘ వెబ్‌సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకకు రాశీఖన్నా ముఖ్య అతిథిగా హాజరైంది. పాయల్‌రాజ్‌పుత్, పూర్ణ, ఈషారెబ్బా ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరించారు. మ్యాగీ దర్శకుడు. ఎస్.కె.ఎన్ నిర్మాత. శుక్రవారం ‘ఆహా’ ఓటీటీ ద్వారా ఈ సిరీస్ విడుదలైంది.
ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ ‘ త్రీ రోజెస్ ట్రైలర్ బాగుంది. తెలుగులో ఇప్పటివరకు రాని కొత్త కథాంశంతో రూపొందించారు. కొత్త ప్రతిభను, టాలెంట్‌ను వెలికితీయడంలో అల్లు అరవింద్ ఎప్పుడూ ముందుంటారు. పెళ్లి కోసం మహిళలు చేసే త్యాగాల్ని ఇందులో అర్థవంతంగా చూపించారు. నా పెళ్లి విషయంలో మా అమ్మనాన్నలు ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు. నా కలల సాకారంలో వారు తోడ్పాటును అందిస్తూనే ఉన్నారు. పాయల్‌రాజ్‌పుత్, పూర్ణ, ఈషా చక్కటి నటనను కనబరిచారు’ అని చెప్పింది.
మారుతి మాట్లాడుతూ “ఆహా’ కోసం ఓ వెబ్‌సిరీస్ చేయమని అల్లు అరవింద్ ఓ సందర్భంలో నాతో చెప్పారు. కథ కోసం ఆలోచిస్తున్న సమయంలో మహిళల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిస్తే బాగుంటుందని మా స్టైలిస్ట్ శ్వేత సలహా ఇచ్చింది. పెళ్లి వల్ల చాలా మంది మహిళల కెరీర్లు ఆగిపోతున్నాయి. అలాంటి వారి జీవితాల్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కించాం. కథ నచ్చి పాయల్, పూర్ణ, ఈషా ఈ సిరీస్‌లో నటించారు. శుక్రవారం నాలుగు ఎపిసోడ్స్ విడుదలచేశాం. ఈ నెల 19 మరో నాలుగు ఎపిసోడ్స్‌ను విడుదలచేయబోతున్నాం’ తెలిపారు. ముగ్గురు అమ్మాయిల స్నేహం, ధైర్యంగా వారు తీసుకునే నిర్ణయాలతో రూపొందిన సిరీస్ ఇదని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది. ఈ కార్యక్రమంలో పూర్ణ, ఎస్కేఎన్, రవి, మ్యాగీ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bala Krishna: అన్‌స్టాపబుల్ షో స్టేజ్‌పై చిందులేసిన బాలయ్య.. ఆ డ్యాన్స్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్
బాలయ్యను చూసి భయపడుతున్న ఆ హీరోయిన్..!
3 Roses Telugu Series | సినీ లవర్స్ ను ఫిదా చేస్తున్న ముగ్గురు భామలు..!
Poorna | కొంటె చూపులతో పూర్ణ ఫోజులు..
ఈషా రెబ్బా హాట్ పోజు.. శరీరాన్ని ఇంద్ర ధనస్సులా తిప్పేసిన తెలుగమ్మాయి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

