Samyuktha Menon | ఇండస్ట్రీలో 90శాతం సక్సెస్ రేట్ ఉన్న కథానాయిక సంయుక్త మీనన్. రాశి కన్నా వాసి ముఖ్యమన్నట్టు ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నది ఈ మలయాళ మందారం. ప్రస్తుతం సౌత్‌లో అన్ని భాషలూ కలిపి ఓ అరడజను సినిమాలు ఈ అమ్మాయి చేతిలో ఉన్నాయి. ఇదిలావుంటే.. ఇటీవలే ఓ తెలుగు సినిమాకు ఈ ముద్దుగుమ్మ పచ్చజెండా ఊపేసిందట. పైగా అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని సమాచారం.
రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యోగి దర్శకుడు. ఈ సినిమాకు ‘రాక్షసి’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఈ టైటిల్‌ని రిజిస్టర్ కూడా చేయించినట్టు తెలుస్తున్నది. ఇందులో సంయుక్త పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుందని వినికిడి. పేరుకు తగ్గట్టే వైల్డ్‌గా ఈ పాత్ర బిహేవ్ చేస్తుందట. అందుకే ఈ కథకు ‘రాక్షసి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కూడా సంయుక్త భాగస్వామిగా ఉంటారని తెలుస్తున్నది.