Rasha Thadani | బాలీవుడ్లో మరో తార మెరిసింది. రవీనా టాండన్ సినీ వారసురాలు రాషా తడానీ.. తన తొలి చిత్రంతోనే సత్తాచాటింది. స్టన్నింగ్ లుక్స్.. అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అజయ్ దేవ్‌గణ్ మేనల్లుడు అమన్ దేవ్‌గణ్ సరసన ‘ఆజాద్’ సినిమాతో రాషా తడానీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి ప్రదర్శనతోనే అందరి మనసులనూ కొల్లగొట్టింది. ఆమె డ్యాన్స్, హావభావాలు చూసిన సినీ విమర్శకులు.. తోటి స్టార్‌కిడ్స్‌కు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న స్టార్‌కిడ్స్.. రాషాను చూసి నేర్చుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఆమె దగ్గర నటనలో, భావవ్యక్తీకరణలో ప్రత్యేక తరగతులు తీసుకోవాలని చెబుతున్నారు. నిజానికి రాషా తెరపై కనిపించకముందే.. తన గాత్రంతో బీటౌన్ హృదయాలను గెలుచుకుంది. ఎందుకంటే.. ఈ స్టార్కిడ్ మంచి గాయని కూడా! ఇక బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవీనా టాండన్.. తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే! గతంలో ‘బంగారు బుల్లోడు’ వంటి పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. కేజీఎఫ్-2లోనూ రమికా సేన్ పాత్రలో దక్షిణాది ఆడియెన్స్‌ను అలరించింది.