కొంతకాలంగా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నారు హీరో రామ్ పోతినేని. గత ఏడాది ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాపై రామ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈసారి పక్కా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారట.
తాజా సమాచారం ప్రకారం… అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ శిష్యుడు లోగీ విఘ్నేష్‌తో రామ్ ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను చేయబోతున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, రామ్ కెరీర్లోనే భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఓ అగ్ర నిర్మాణ సంస్థ రూపొందించబోతున్న ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని తెలిసింది.