RAPO 22 | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న తాజా చిత్రం రాపో 22 (RAPO 22). మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు (Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఇటీవలే పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది.
ప్రతీ రోజు ఏదో ఒక వార్తను షేర్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తుంది రామ్ టీం. మీకు సుపరిచితుడు.. మీలో ఒకడిని డిసెంబర్ 6న 10:08 గంటలకు పరిచయం చేయబోతున్నట్టు ప్రకటించారు. రామ్ సైకిల్‌పై వెళ్తున్న లుక్‌ను చూపించి చూపించనట్టుగా షేర్ చేశారు. మొత్తానికి రామ్ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని కొత్త అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రంతో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల ద్వయం వివేక్-మెర్విన్తోపాటు మేరిక్రిస్మస్, మలైకొట్టై వాలిబన్తోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రఫర్ మధు నీలకందన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు నేషనల్ అవార్డు విన్నింగ్ టెక్నీషియన్ (ఎడిటర్) అక్కినేని శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తుండటంలో అంచనాలు పెరిగిపోతున్నాయి.
మీకు సుపరిచితుడు… మీలో ఒకడు ..✨
Introducing the One Among You from #RAPO22 on December 6th at 10:08 AM 🤩@ramsayz @bhagyasriiborse @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @sreekar_prasad #MadhuNeelakandan @artkolla #RAPO pic.twitter.com/eQa1p28iUt
— BA Raju’s Team (@baraju_SuperHit) December 5, 2024
Tyson Naidu | బర్త్ డే స్పెషల్.. డీజే టిల్లు భామ టైసన్ నాయుడు లుక్ వైరల్
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?