Rao Bahadur | టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించార . బ్లఫ్ మాస్టర్ సినిమా తర్వాత ఆయన నటనకు చాలామంది ఫిదా అయ్యారు. ఇటీవల జీబ్రా చిత్రంతో ఆకట్టుకున్న సత్యదేవ్ ఇప్పుడు రావు బహదూర్ అనే చిత్రంతో మరింత వినోదం పంచబోతున్నాడు. ఆయన నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్న వారికి ఈ మూవీ సమాధానం చెప్పేల కనిపిస్తుంది. “రావు బహదూర్” అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యదేవ్ పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించాడు.
ఇటీవల విడుదలైన పోస్టర్ని చూసి ఇది ఫాంటసీ డ్రామా కానుందా? అనే ఆసక్తి కలుగుతుంది. ఈ చిత్రాన్ని కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు.”అనుమానం పెనుభూతం” అనే లైన్‌ను హైలైట్ చేస్తున్న నేపథ్యంలో ఇందులో ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయని అర్ధమవుతుంది.తాజాగా మూవీ టీజర్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్.. నాకు అనుమానం అనే భూతం పట్టిందనే ఆసక్తికర డైలాగ్‌తో ప్రారంభమైంది. సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సైకలాజికల్ డ్రామాగా దీనిని తీర్చి దిద్దినట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. వచ్చే సమ్మర్‌కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ నుంచి ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం మళ్ళీ ఆయనలో చూడబోతున్నామని, మహేశ్వర ఉగ్రరూపస్య తరహా ఇంపాక్ట్‌ను వెంకటేష్ మహా మళ్ళీ అందించబోతున్నాడని అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ సినిమాస్ నిర్మిస్తుండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పిస్తున్నారు. ‘రావు బహదూర్’ అనేది ఓ రాజవంశం నేపథ్యంలో సాగే ఒక సైకలాజికల్ డ్రామా. దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్ వెంకటేష్ మహానే చేశారు. స్మరణ్ సాయి సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి దినేష్ యాదవ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.