పైన ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తు పట్టారా? అతని అభిమానులు కూడా ఒక్క క్షణం అతన్ని గుర్తు పట్టలేరేమో. ఎప్పుడూ కొత్త కొత్త లుక్స్‌తో అలరించే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇప్పుడీ లేటెస్ట్ లుక్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు. బ్లూ కలర్ ట్రాక్‌సూట్, పొడవైన జుట్టు, ఓ లెదర్ హ్యాండ్‌బ్యాగ్‌తో ఉన్న ఈ ఫొటో వైరల్ అవుతోంది. పైగా మెడలో భారీగా నగలు వేసుకోవడం మరీ వింతగా అనిపిస్తోంది. నా ప్రియమైన అలెజాండ్రో అని ఈ ఫొటోలకు క్యాప్షన్ పెట్టిన రణ్వీర్.. అలెజాండ్రో మిచెల్, గుచ్చిలను ట్యాగ్ చేశాడు.
నిమిషాల్లోనే బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు వందల కొద్దీ కామెంట్లతో రణ్వీర్ కొత్త లుక్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. Oh! Oh! Oh!!! అంటూ ఆలియా భట్ ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేసింది. హిస్టారిక్ అంటూ హిమేష్ రేషమియా అన్నాడు. అర్జున్ కపూర్ అయితే అతన్ని హాలీవుడ్ నటుడు జేరెడ్ లీటోతో పోలుస్తూ వీర్ లీటో అని కామెంట్ చేయడం విశేషం. ఇక అభిమానులైతే తమకు మరో మీమ్ పండుగ వచ్చిందని కామెంట్లు పోస్ట్ చేశారు. మీ భార్య దీపికా పదుకోన్ డ్రెస్ వేసుకున్నావా అని ఓ అభిమాని కామెంట్ చేశాడు.