Circus Movie Trailer | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రామ్‌లీల’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావతి’ వంటి సినిమాలతో తెలుగులోనూ ఈయన మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గల్లిబాయ్ తర్వాత రణ్వీర్ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ’83’, ‘జయేష్‌భాయ్ జోర్దార్’ వంటి సినిమాలతో రణ్వీర్ ప్రేక్షకులను పలకరించాడు. కాగా ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాలు సాధించాయి. దాంతో ప్రస్తుతం రణ్వీర్ ఆశలన్ని ‘సర్కస్’ చిత్రంపైనే ఉన్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ మొత్తం హాస్యాస్పదంగా సాగింది. 60వ దశకంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. రణ్వీర్ సింగ్ గెటప్స్, లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రోహిత్ శెట్టి మళ్ళీ తన కామెడీతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చివర్లో దీపికా ఎంట్రీ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రణ్వీర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. టీ సరిస్ ఫిలింస్, రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్తో కలిసి రోహిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. రణ్‌వీర్‌కు జోడీగా పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌లు నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.